40 లో అడుగుపెడుతున్న ప్రభాస్ ,మరి పెళ్లెప్పుడో ?


Prabhas is entering into 40s when is his marriage?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ అక్టోబర్ లో 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు ,మరి పెళ్లి ఎప్పుడు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . గతకొంత కాలంగా ప్రభాస్ పెళ్లి అంటూ రకరకాల కథనాలు వస్తున్నాయి కానీ పెళ్లి మాత్రం కావడం లేదు . అదిగో ఫలానా వాళ్ళ అమ్మాయిని చూశారట ! ఇక త్వరలోనే వివాహ నిశ్చితార్థం ,పెళ్లి అంటూ ఊహాగానాలు వస్తున్నాయి తప్ప ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి మాత్రం వాయిదాపడుతూనే ఉంది . ఇక ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు అయితే ప్రభాస్ కు పెళ్లి చేయాలనీ తహతహలాడాడు కానీ ఆ ముచ్చట మాత్రం తీరడం లేదు . అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు అంటే మరో నెల 15 రోజుల్లో 39 ఏళ్ళు పూర్తిచేసుకొని 40 వ సంవత్సరంలోకి అడుగుపెడతాడు .

తమ పిల్లలకు త్వరగా పెళ్లి చేసి మనవడు , మనవరాళ్లతో ఆడుకోవాలని , ఇల్లంతా పిల్లల ఆటలతో సంతోషంగా గడపాలని తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ అనుకుంటారు , పెళ్లిళ్లు ఆలస్యం అయితే ఇంటి పక్కన ఉన్నవాళ్లకు సంతోషమే సంతోషం ఎందుకంటే ఎంజాయ్ చేయాలని తెగ ఆరాటపడుతుంటారు రకరకాలుగా . ఒకవైపు అనుష్క కూడా పెళ్లి చేసుకోవడం లేదు , మరోవైపు ప్రభాస్ కూడా పెళ్లి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు దాంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వస్తున్నాయి . అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుగా పెళ్లి చేసుకుంటే కనీసం పుకార్లు అయినా ఆగుతాయి .

English Title: Prabhas is entering into 40s when is his marriage?