హాలీవుడ్ పై ప్రభాస్ ప్రేమ


హాలీవుడ్ పై ప్రభాస్ ప్రేమ
హాలీవుడ్ పై ప్రభాస్ ప్రేమ

బాహుబలి అనంతరం ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయి వరకు వెళ్లిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాహో సినిమా బాలీవుడ్ లో సైతం సాలిడ్ సక్సెస్ ని అందుకోవడంతో ప్రభాస్ భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి వెళతాడని చెప్పవచ్చు, ఇక హాలీవుడ్ లో సైతం ప్రభాస్ కనిపించే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల ప్రభాస్ హాలీవుడ్ పై కూడా ఓ కామెంట్ చేశాడు.

రీసెంట్ గా బాహుబలి బృందంతో కలిసి ప్రభాస్ లండన్స్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ని సందర్శించిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా స్పెషల్ లైవ్ స్క్రీనింగ్ పూర్తయ్యాక ప్రభాస్ స్టామినా ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. వివిధ దేశాల నుంచి వచ్చిన అభిమానులు ప్రభాస్ ని చూసేందుకు ఎగబడ్డారు. అయితే హాలీవుడ్ సినిమాలో నటించవచ్చుగా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు రెబల్ స్టార్ కూల్ ఆన్సర్ ఇచ్చాడు.

“తప్పకుండా.. హాలీవుడ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నాకు సెట్టయ్యే మంచి కథ దొరికితే హాలీవుడ్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను” అని ప్రభాస్ సింపుల్ గా ఫ్యాన్స్ కి ఆన్సర్ ఇచ్చాడు. మరి ప్రభాస్ ని హాలీవుడ్ లో చూపించడానికి ఎలాంటి డైరెక్టర్ పైనుంచి దిగివస్తాడో చూడాలి. ఇక ఇటీవల 40 పుట్టినరోజు జరుపుకున్న ప్రభాస్ నెక్స్ట్ జాన్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.