ప్రభాస్ కోటిన్నర నుండి మూడొందల యాభై కోట్లకు


Prabhas's Journey from 1 CR to 350CR
Prabhas’s Journey from 1 CR to 350CR

ఎలాంటి ప్రభాస్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడని మాట్లాడుకుంటున్నారు సదరు సినీ అభిమానులు. కెమెరా ముందుకు రావడానికే సిగ్గుగా ఫీలయ్యే ప్రభాస్ ఇప్పుడు సాహో ప్రమోషన్ల కోసం తీరిక లేకుండా తిరిగేస్తున్నాడు. ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం సాహోను మొదటి రోజు చూడటానికి అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

సాహో బడ్జెట్ ఏకంగా 350 కోట్లు. ఇండియన్ సినిమాలలో అత్యధిక బడ్జెట్ లతో తెరకెక్కిన సినిమాలలో సాహో ముందువరసలో ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమాకి 350 కోట్లు బడ్జెట్ వచ్చింది కానీ తన తొలి సినిమాకు బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం కోటిన్నర. ఈ విషయాన్ని ప్రభాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఈశ్వర్ ఎక్కువగా రోడ్లపైనే చిత్రీకరణ జరిపామని అందుకే కోటిన్నర బడ్జెట్ లో తీయగలిగామని చెప్పాడు. ప్రభాస్ లాంచ్ గా ఈశ్వర్ బాగానే ఉపయోగపడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సాహో కూడా హిట్ అయితే ప్రభాస్ ను అనుకోవడం ఇక ఏ హీరోకైనా కష్టమే.