చందమామ కథ తరహాలో ప్రభాస్ కొత్త చిత్రం


Prabhas Nag Ashwin movie be like a chandamama story
Prabhas Nag Ashwin movie be like a chandamama story

ఎవరూ ఊహించని రీతిలో రెబెల్ స్టార్ ప్రభాస్ తర్వాతి సినిమా గురించిన ప్రకటన రీసెంట్ గా వచ్చింది. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ ప్రేమ కథను చేస్తోన్న ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయనున్నాడు. ప్రభాస్ కున్న ఇమేజ్ కు, నాగ్ అశ్విన్ కున్న ఇమేజ్ అస్సలు మ్యాచ్ అవ్వదు. అందుకే ఈ కాంబినేషన్ భలే కొత్తగా అనిపించింది. ఈ ఏడాది చివర్లో సినిమా లాంచ్ చేసి వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ కెరీర్ లో ఇప్పటివరకూ చేసిన రెండు సినిమాలూ కూడా దేనికదే భిన్నమైనది. ఇప్పుడు మూడో సినిమాగా ప్రభాస్ తో తీస్తున్నది కూడా డిఫెరెంట్ సినిమానే అని తెలుస్తోంది. మొదటి సినిమా సోషల్ డ్రామా, రెండోది బయోపిక్ చేసిన నాగ్ అశ్విన్ మూడో సినిమాను ఒక అందమైన చందమామ కథలా చెప్పబోతున్నాడట.

మహానటి విడుదల సమయంలోనే పాతాళ భైరవి తరహాలోనే మంత్రాలూ, మాయలూ అన్నీ ఉండే ఒక అందమైన కల్పిత కథను చెప్పాలని అనుకుంటున్నట్లు చూచాయిగా తెలిపాడు నాగ్ అశ్విన్. ఇక అశ్వినీదత్ అందుకుని ఈ సినిమాకు చిరంజీవి అయితే సెట్ అవుతాడని అన్నారు. అయితే చిరంజీవితో సెట్ అవ్వని సినిమా ఇప్పుడు ప్రభాస్ వద్దకు వచ్చింది. సింగిల్ సిట్టింగ్ లో నాగ్ అశ్విన్ చెప్పిన కథను ఓకే చేసాడు ప్రభాస్. వెంటనే డేట్లు ఇచ్చేసాడు. తన కెరీర్ కు ఈ చిత్రం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు.

మరోసారి ప్యాన్ ఇండియా సినిమానే ప్రభాస్ చేయనున్నాడు. ఇటీవలే నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభాస్ ప్యాన్ ఇండియాను ఎప్పుడో కొట్టేశాడని, ఇప్పుడు ప్యాన్ వరల్డ్ సినిమాను చేస్తున్నాడని తెలిపి అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు వైజయంతి మూవీస్ మరో బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ముందుకెళ్లనుంది.