ప్ర‌భాస్ సినిమాకి సాలీడ్ టైటిల్‌!


ప్ర‌భాస్ సినిమాకి సాలీడ్ టైటిల్‌!
ప్ర‌భాస్ సినిమాకి సాలీడ్ టైటిల్‌!

`సాహో` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో మ‌ళ్లీ కొత్త క‌థనే ప్ర‌భాస్ ఎంచుకున్నారు. పిరియాడిక్ రొమాంటిక్ డ్రామా క‌థ‌తో ప్ర‌భాస్ ఓ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి `జిల్` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోంది. యూవీ క్రియేష‌న్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్ర‌భాస్ చిత్రాల్లో బాహుబ‌లి, సాహో చిత్రాల త‌రువాత అత్యంత బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో ఈ సినిమా కోసం భారీ సెట్‌ని నిర్మించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోని హీరో ప్ర‌భాస్ అభిమానుల‌తో పంచుకున్న విష‌యం తెలిసిందే. అంద‌రి ఊహ‌ల‌కు నెక్ట్స్ లెవెల్‌లో వుండే సినిమా ఇద‌ని ద‌ర్శ‌కుడు చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. అంద‌కు త‌గ్గ‌ట్టుగానే స్టూడియోలో వేసిన సెట్ ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రానికి మొద‌టి నుంచి `జాన్‌` అనే టైటిల్ వినిపించింది. అయితే దానికి ద‌గ్గ‌ర‌గా స‌మంత న‌టించిన `జాను` టైటిల్ వుండ‌టం, దిల్ రాజు కోరి మ‌రీ ఆ టైటిల్‌ని ప్ర‌భాస్ చేత క‌న్ఫ‌ర్న్ చేయించుకోవ‌డంతో ప్ర‌భాస్ సినిమాకు కొత్త టైటిల్ అవ‌స‌రం ఏర్ప‌డింది.

దీంతో మేక‌ర్స్ క‌థ‌కు త‌గ్గ టైటిల్‌ని ఇటీవ‌ల రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రానికి `రాధే శ్యామ్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేయాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భాస్‌, మేక‌ర్స్ వున్న‌ట్టు తెలిసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్టున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.