ప్ర‌భాస్ స‌ర్‌ప్రైజ్ కూడా ఆరోజేనా?

ప్ర‌భాస్ స‌ర్‌ప్రైజ్ కూడా ఆరోజేనా?
ప్ర‌భాస్ స‌ర్‌ప్రైజ్ కూడా ఆరోజేనా?

`సాహో` చిత్రం అనుకున్న స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో కొంత విరామం తీసుకున్న‌ప్ర‌భాస్ ఈ మ‌ధ్యేనే కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. యువీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణా మూవీస్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ నెల 4 నుంచి జార్జియాలో ప్రారంభం కాబోతోంది.  ఇందు కోసం చిత్ర యూనిట్ ఈ నెల 2నే జార్జియాకు బ‌య‌లు దేరుతోంది. అక్క‌డే 25 రోజుల పాటు భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశార‌ట‌. ఈ షెడ్యూల్ పూర్త‌యిన త‌రువాతే ఈ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్టు తెలిసింది.

అంటే స‌రిగ్గా ఉగాది రోజునే ఈ మూవీ టైటిల్, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ మూవీ కోసం `జాన్‌` అనే పేరు స్టార్టింగ్ నుంచి వినిపిస్తోంది. కానీ నిర్మాత‌లు మాత్రం `ఓ డియ‌ర్‌`, `రాధేశ్యామ్‌` అనే టైటిల్స్‌ని రిజిస్ట‌ర్ చేయించింది. స్టోరీ ప్ర‌కారం `రాధేశ్యామ్‌` యాప్ట్ టైటిల్ అని మెజారిటీ వ‌ర్గం టీమ్ మెంబ‌ర్స్ భావిస్తున్నాక‌ట‌. ఆ పేరే ఫైన‌ల్ చేస్తార‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.