ప్రభాస్ 21 సినిమాపై ఊహించని ప్రకటన


ప్రభాస్ 21 సినిమాపై ఊహించని ప్రకటన
ప్రభాస్ 21 సినిమాపై ఊహించని ప్రకటన

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఓ డియర్ లేదా రాధే శ్యామ్ లో ఒక టైటిల్ ను ఈ చిత్రానికి ఫిక్స్ చేస్తారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. సాహో ప్లాప్ తర్వాత ప్రభాస్ తన 20వ సినిమాకు మార్పులు చేర్పులు సూచించినట్లు వార్తలు వచ్చాయి. బడ్జెట్ విషయంలో కూడా మళ్ళీ సమీక్షించుకుని కొన్ని నెలల బ్రేక్ తర్వాత తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ప్రభాస్ తదుపరి చిత్రంపై బోలెడన్ని రూమర్స్ రావడం మొదలయ్యాయి.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ తదుపరి చిత్రం ఉంటుందని అన్నారు. లేదు సైరా ను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ప్రభాస్ కు కథ వినిపించాడని చెప్పారు. కాదు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ డైరెక్షన్ లోనే ప్రభాస్ సినిమా ఉంటుందన్నారు. అయితే ఇవేమీ నిజాలు కావని తేలిపోయింది. మరోసారి ప్రభాస్ యువ దర్శకుడికే ఓటు వేశాడు.

మహానటి చిత్రంతో అందరి మన్ననలు, బోలెడన్ని అవార్డులు గెలుచుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ 21వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. గత 49 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలుస్తూ వచ్చిన వైజయంతి మూవీస్ 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ప్రభాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసారు. ఈ ఏడాదే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది.

నాగ్ అశ్విన్ కెరీర్ లో చేసినవి రెండే చిత్రాలు. ఎవడె సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో విభిన్నంగా ఆలోచించే దర్శకుడిగా నాగ్ అశ్విన్ పేరు సంపాదించుకున్నాడు. ఇటీవలే నిర్మాతగా కూడా మారిన అశ్విన్ ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో సినిమా చేస్తుండడం నిజంగా ఆశ్చర్యకరమే. మరి ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటి, మిగతా వివరాలు ఏంటి వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.