ప్రభాస్ కు కొత్త టైటిల్ అవసరమొచ్చిందిగా


Prabhas next film team in search for a new title
Prabhas next film team in search for a new title

ఈ రకమైన ట్రెండ్ తెలుగు ఇండస్ట్రీలో బాగా జరుగుతూ ఉంటుంది. సినిమాలు చిత్రీకరణ దశలో ఉంటే వర్కింగ్ టైటిల్స్ ఉండడం అనేది కామన్. అయితే అదే సినిమాకు టైటిల్ అవుతుందన్న గ్యారంటీ లేదు. అయితే ఒక సినిమాకు వర్కింగ్ టైటిల్ గా అనుకున్నది మరో చిత్రానికి మెయిన్ టైటిల్ గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రభాస్, శర్వానంద్ సినిమాలకు ఇదే జరిగింది. వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ కూడా కావడం విశేషం. సాహో తర్వాత ప్రభాస్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమాకు మొదటి నుండి జాన్ టైటిల్ గా ప్రచారం జరిగింది. సాహో చిత్రీకరణ సమయంలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలవ్వగా, అప్పట్లో ఆ చిత్ర యూనిట్ జాన్ హ్యాష్ ట్యాగ్ ను కూడా ఉపయోగించారు. దీంతో ఇదే మూవీ టైటిల్ గా భావించారు ప్రేక్షకులు.

కట్ చేస్తే ఇప్పుడు ఈ చిత్రాన్ని పోలిన టైటిల్ శర్వానంద్ సినిమాకు ఫిక్స్ చేసారు. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తమిళ బ్లాక్ బస్టర్ 96′ రీమేక్ కు జాను అనే టైటిల్ ను ఖరారు చేసారు నిర్మాత దిల్ రాజు. 96′ ను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయడం విశేషం. నిన్ననే  జాను టీజర్ విడుదలవగా 96′ మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేయబోతున్నారు అంటూ ప్రేక్షకులు ఈ చిత్రంపై పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. జాను అనే టైటిల్ కూడా ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా శర్వానంద్, సమంత జంట బాగుండడం, వాళ్ళ పెర్ఫార్మన్స్ హైలైట్ గా ఉంటుందని భావన కలిగించడం ఈ చిత్రానికి ప్లస్ గా చెప్తున్నారు.

శర్వానంద్ సినిమాకు జాను అనే టైటిల్ ను ఫిక్స్ చేయడంతో ప్రభాస్ అభిమానులు తమ సినిమా సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనికి చిత్ర యూనిట్ కు దగ్గర వర్గాల నుండి సమాధానమొచ్చింది కూడా. జాన్ అనే టైటిల్ ను తాము ఎప్పుడో వదిలేసుకున్నామని, కొత్త టైటిల్ కోసం అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు.