ప్రభాస్ సినిమా కూడా ఆ దారిలోనే..


ప్రభాస్ సినిమా కూడా ఆ దారిలోనే..
ప్రభాస్ సినిమా కూడా ఆ దారిలోనే..

కరోనా వైరస్ ప్రభావం అన్ని ఇండస్ట్రీలతో పాటు సినిమా ఇండస్ట్రీపై కూడా గట్టి ప్రభావమే చూపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. షూటింగ్ లు అన్నీ ఆపేసారు. లాక్ డౌన్ ను ఈ నెలాఖరు దాకా పొడిగించారు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ కూడా అవ్వని పని. ఇవన్నీ ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియని పరిస్థితి.

ఏప్రిల్ 30 తర్వాత కూడా ఎప్పుడు షూటింగ్స్ కు అనుమతి లభిస్తుందో క్లారిటీ లేదు. కొన్ని సినిమాలు విడుదలకు షెడ్యూల్ అయ్యి ఇప్పుడు పరిస్థితుల కారణంగా రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. షూటింగ్ లో ఉండి రిలీజ్ డేట్ లు ప్రకటించిన సినిమాలు విడుదల ఎప్పుడన్నది క్లారిటీ లేకుండా ఉన్నాయి. అసలు షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలిస్తే కదా రిలీజ్ డేట్ లపై క్లారిటీ వచ్చేది. అందుకే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ లకు షెడ్యూల్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి.

భారీ సినిమాలు, ప్యాన్ ఇండియా సినిమాలది కూడా ఇదే పరిస్థితి. కేజిఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఇప్పటికే వాయిదా పడుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. చిరంజీవి ఆచార్య కూడా ఇదే బాటలో ఉంది. ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా వాయిదా పడిందని వార్తలు అందుతున్నాయి. ప్రభాస్20 సినిమాకు రాధా కృష్ణ కుమార్ దర్శకుడన్న విషయం తెల్సిందే.

ఈ సినిమా షూటింగ్ జార్జియాలో కొనసాగుతుండగా కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ ను రద్దు చేసుకుని ప్రభాస్ అండ్ టీమ్ ఇండియా తిరిగి వచ్చేసింది. ఇండియాలో కరోనా ఏప్రిల్ 30కి కంట్రోల్ అయ్యి లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ కు అనుమతి లభించినా ప్రభాస్20 జార్జియాలో షూటింగ్ ను కొనసాగించాలి. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కనీసం మరో నాలుగు నెలలు విదేశాల్లో షూటింగ్స్ కు అనుమతి లభించే అవకాశం లేదు. సో ప్రభాస్20 వచ్చే ఏడాదికి వాయిదా పడడం మినహా మరో ఆప్షన్ లేదు.