రెండు యాంగిల్స్ లోనూ ప్రభాస్ యాక్షన్ కుమ్ముడే


రెండు యాంగిల్స్ లోనూ ప్రభాస్ యాక్షన్ కుమ్ముడే
రెండు యాంగిల్స్ లోనూ ప్రభాస్ యాక్షన్ కుమ్ముడే

రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో పరాజయం తర్వాత చేస్తున్న సినిమా ఓ డియర్. ఈ టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ప్రస్తుతం ఉన్న టాక్ ను బట్టి ఇదే టైటిల్ అని అనుకోవచ్చు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ ఫారిన్ లో చిత్రీకరించాల్సి ఉన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ లోనే సెట్స్ వేసి అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించి షూటింగ్ ను కానిచ్చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని భావించారు కానీ అది వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రెండు భిన్న పాత్రల్లో నటిస్తున్నాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. 1980ల కాలం నాటి ప్రభాస్, ఇప్పటి ప్రభాస్ ఇలా రెండు వేరియేషన్స్ ఉంటాయట. ఇకపోతే ఈ రెండు నేపధ్యాలలోనూ యాక్షన్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. అవ్వడానికి ఇది ప్రేమ కథే అయినా రివెంజ్ మెయిన్ ఎలిమెంట్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు టైమ్ లైన్స్ లో కూడా ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా సమాంతరంగా తెరకెక్కుతోంది. మిగిలిన సౌత్ ఇండియన్ భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువదించనున్నారు. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ కూడా సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన సంగీత దర్శకుడు ఎవరన్న విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు.