బాహుబ‌లి క్వారెంటైన్ టైమ్ ఇలా వుంద‌ట‌!


బాహుబ‌లి క్వారెంటైన్ టైమ్ ఇలా వుంద‌ట‌!
బాహుబ‌లి క్వారెంటైన్ టైమ్ ఇలా వుంద‌ట‌!

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భ‌లుతున్న స‌మ‌యంలో సాహ‌సోపేతంగా వ్య‌వ‌హ‌రించారు ప్ర‌భాస్ అండ్ టీమ్‌. `సాహో` వంటి పాన్ ఇండియా స్థాయి చిత్రం త‌రువాత ప్ర‌భాస్ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌తో పాటు గోపీకృష్ణా మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని `జిల్` ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్నారు.

`జాన్‌` పేరు ప్ర‌చారంలో వున్న ఈ చిత్రాన్ని కొత్త ప్ర‌పంచం నేప‌థ్యంలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్ర కీల‌క షెడ్యూల్ కోసం హీరో ప్ర‌భాస్‌, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు చిత్ర బృందం జార్జియా వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య షూటింగ్ పూర్తి చేసుకుని టీమ్ ఇండియా తిరిగి వ‌చ్చేసింది. విదేశాల నుంచి వ‌చ్చారు కాబ‌ట్టి 14 రోజుల పాటు క్వారెంటైన్‌లో వుండాల‌ని శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఈ బృందాన్ని ప‌రీక్షించిన వైద్య సిబ్బంది సూచించారు.

వారి సూచ‌న‌ల మేర‌కు టీమ్ మెంబ‌ర్‌తో పాటు ప్ర‌భాస్‌, పూజా హెగ్డే ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. పూజా హెగ్డే క్వాఎంటైన్ టైమ్‌లో వెరైటీ యోగా చేస్తూ ఆ వీడియోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటోంది. ప్ర‌భాస్ మాత్రం త‌న‌కు న‌చ్చిన వారికి వీడియో కాల్స్ చేస్తూ క్వారెంటైన్ టైమ్‌ని గ‌డిపేస్తున్నార‌ట‌.