ప్ర‌భాస్ డ్రెస్‌ల‌కి అంత ఖర్చు చేశారా?

ప్ర‌భాస్ డ్రెస్‌ల‌కి అంత ఖర్చు చేశారా?
ప్ర‌భాస్ డ్రెస్‌ల‌కి అంత ఖర్చు చేశారా?

రొమాంటిక్ పీరియడ్ డ్రామా `రాధే శ్యామ్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా న‌టిస్తున్నారు. రాధాకృష్ఱ‌కుమార్ ద‌ర్శ‌‌క‌త్వం వహిస్తున్నారు. ‌పూజా హెగ్డే హీరోయిన్. యూర‌ప్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌సీద నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

పిరియాడిక్ ల‌వ్‌స్టోరీ కాబ‌ట్టి ఈ చిత్రాన్ని ఇటలీ నేప‌థ్యంలో అత్య‌ధిక భాగం చిత్రీక‌రించారు. హెరిటేజ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ 1980వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగ‌నుంది. యూర‌ప్‌, జార్జియా వంటి సుంద‌ర ప్ర‌దేశాల్లో వున్న హెరిటేజ్ వాతావ‌ర‌ణంలో చిత్రీక‌రించారు. ఇందులో ప్ర‌భాస్ వేసుకునే డ్రెస్‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌. ఇందు కోసం కాస్ట్యూమ్స్‌కు భారీ స్థాయిలో ఖర్చు చేసిన‌ట్టు తెలిసింది.

ఫిల్మ్ యూనిట్ ప్రభాస్ దుస్తుల కోసం బడ్జెట్‌లో దాదాపు 6 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.ఈ చిత్రం అంతటా ప్రభాస్ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులలో కనిపించ‌నున్నారు. ఇకపై పాతకాలపు దుస్తులను ఎవరూ ఉపయోగించరు కాబట్టి, ప్రభాస్ దుస్తులను కుట్టడానికి ఫిల్మ్ యూనిట్ ప్రత్యేక డిజైనర్లను నియమించింది. ప్రభాస్ కెరీర్‌లో ముఖ్యంగా అతని దుస్తులను బట్టి ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి అని చెబుతున్నారు. ఈ చిత్రం జూలై 30 న ప్ర‌పంచవ్యాప్తంగా ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది.