`రాధేశ్యామ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది


`రాధేశ్యామ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది
`రాధేశ్యామ్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌‌భాస్ అభిమానుల‌కు పుట్టిన రోజు స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి స‌ర్‌ప్రైజ్ కావాలంటూ అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. యువీ టీమ్‌ని ఓ ద‌శ‌లో డైరెక్ట్‌గా క్వొచ్చ‌న్ చేశారు కూడా. వారి ఎదురుచూపుల‌కు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే రోజే మోష‌న్ పోస్ట‌ర్‌తో స‌ర్‌ప్రైజ్ ఇచ్చే‌చేశారు.  రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని యువీ క్రియేష‌న్స్ , టిసిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

`బీట్స్ ఆఫ్ రాధేశ్య‌మ్‌` పేరుతో విడుద‌లైన `రాధేశ్యామ్ ` మోష‌న్ పోస్ట‌ర్ విజువ‌ల్ వండ‌ర్‌గా నిలుస్తోంది. పిరియాడిక్ ఫిక్ష‌న‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీతం అందించిన ఈ మోష‌న్ పోస్ట‌ర్ సినిమా ఓ రేంజ్‌లో వుంటు్ంద‌ని స్ప‌ష్టం చేస్తోంది. మోష‌న్ పోస్ట‌ర్ ప్రారంభంలో రోమియో – జూలియట్, దేవదాస్ – పార్వతి మరియు ఇతర‌ ప్రేమ కథలను చరిత్రలో విన్నాము. అంటూ దీనికి త‌ర‌హాలోనే రాధేశ్యామ్‌ల ప్రేమ‌క‌థ కూడా వుంటుంద‌నే లీడ్‌ని అందించారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో స‌చిన్ ఖేడేక‌ర్‌, భాగ్య‌శ్రీ‌, ప్రియ‌ద‌ర్శి పులికొండ‌, ముర‌ళీశ‌ర్మ‌, కునాల్ రాయ్ క‌పూర్‌, స‌త్య‌న్ శివ‌కుమార్‌, సాషా చెట్రి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రోమియో జూలియ‌ట్ ల ప్రేమ‌క‌థ త‌ర‌హాలో ఈ చిత్రాన్ని రాధాకృష్ణ‌కుమార్ తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ఇట‌లీలో జ‌రుగుతోంది.