అనుష్కతో రిలేషన్ గురించి ఓపెన్ అయిన ప్రభాస్


Prabhas Reaction on Marriage rumours
Prabhas Reaction on Marriage rumours

నేను అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అవి నిజం కాదని అలాగే అనుష్క తో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోందని అది కూడా నిజం కాదని,మంచి ఫ్రెండ్ మాత్రమేనని తేల్చి చెప్పాడు ప్రభాస్ .

సాహో విడుదలకు సిద్దమైన నేపథ్యంలో బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రభాస్ .

ఆ సందర్బంగా అనుష్క తో డేటింగ్ గురించి , అమెరికా అమ్మాయి గురించి స్పందించాడు .

సాహో రిలీజ్ అయ్యాక జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్ .

ఆగస్టు 30 న విడుదలయ్యే సాహో కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు .

అయితే అనుష్క తో డేటింగ్ చేయడం లేదని చెబుతున్నాడు కానీ ఒకవైపు అనుష్క పెళ్లి చేసుకోవడం లేదు అలాగే ప్రభాస్ కూడా పెళ్లి ని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు దాంతో ఈ ఊహాగానాలు వస్తున్నాయి .