మరో భారీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన ప్రభాస్


Prabhas rejects once again karan johars film ఇప్పటికే బాలీవుడ్ లో వచ్చిన రెండు అవకాశాలను వదులుకున్న ప్రభాస్ తాజాగా మరో ఆఫర్ ని సైతం తిరస్కరించి షాక్ ఇచ్చాడు బాలీవవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ కు . తాజాగా కరణ్ జోహార్ ” తఖ్త్ ” అనే భారీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు కాగా ఆ సినిమాలో ఒక హీరోగా నటించమని ప్రభాస్ ని కరణ్ జోహార్ కోరాడట అయితే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట ప్రభాస్ . బాలీవుడ్ లో ఆఫర్ వస్తే ప్రభాస్ తిరస్కరించి తప్పు చేస్తున్నాడు అని అనుకుంటున్నారా ? ప్రభాస్ చేసింది కరక్ట్ ! ఎందుకంటే ఆ సినిమాలో ప్రభాస్ మెయిన్ హీరో కాదు సెకండ్ హీరో అందుకు రిజెక్ట్ చేసాడట !

రణ్ వీర్ సింగ్ మెయిన్ హీరో కాగా ప్రభాస్ ని సెకండ్ హీరోగా నటించమని కోరాడట ! బాహుబలి , బాహుబలి 2 తో ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన హీరో ప్రభాస్ అలాంటిది సెకండ్ హీరోగా నటిస్తే అతడికి నచ్చడం పక్కన పెట్టండి అభిమానులు ఊరుకుంటారా ? అందుకు ఆ సినిమాని రిజెక్ట్ చేసాడట ప్రభాస్ . ప్రస్తుతం సాహో చిత్రంతో తలపడుతున్నాడు , అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నీ ప్రభాస్ స్నేహితులు యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .

English Title: prabhas rejects once again karan johars film