రాజమౌళిని తప్పుపట్టిన ప్రభాస్


Prabhas responds on Rajamouli comments
Prabhas responds on Rajamouli comments

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి అభిప్రాయాన్ని తప్పుపట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

ఇంతకీ రాజమౌళి చెప్పిన అభిప్రాయం ఏంటో తెలుసా ……. సౌత్ హీరోల కంటే బాలీవుడ్ హీరోలు వెనుకంజలో ఉన్నారు తమ అభిమానుల అంచనాలను అందుకోవడంలో అంటూ బాహుబలి సమయంలో రాజమౌళి చెప్పడమే !

కట్ చేస్తే ఇన్నాళ్లకు రాజమౌళి అప్పట్లో అన్న మాటని ప్రభాస్ దగ్గర ప్రస్తావిస్తే రాజమౌళి గారి అభిప్రాయంతో నేను ఏకీభవించను ఎందుకంటే తమ అభిమానుల ఆశలను అర్ధం చేసుకోకుండా వాళ్ళు సూపర్ స్టార్ లు ఎలా అవుతారు అంటూ వివరణ ఇచ్చాడు ప్రభాస్.

రాజమౌళి బాహుబలి సమయంలో అన్న మాటలను ఇన్నాళ్లకు ప్రభాస్ ముందుంచారు.

దాంతో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు ప్రభాస్.

ఇక ప్రభాస్ నటించిన సాహో ఆగస్టు 30 న విడుదల అవుతుండగా రాజమౌళి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ సినిమా తీసే పనిలో ఉన్నాడు.