తమిళనాట రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతున్న సాహో


Saaho
Saaho

తమిళనాట రికార్డ్ స్థాయిలో విడుదల అవుతోంది సాహో . ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రానికి తమిళనాట 525 థియేటర్ లు మాత్రమే లభించగా సాహో చిత్రానికి ఏకంగా 550 థియేటర్ లు లభిస్తున్నాయి .

బాహుబలి , బాహుబలి 2 చిత్రాలు సంచలన విజయాలు సాధించడంతో సాహో పై భారీ అంచనాలు నెలకొన్నాయి . దాంతో ఎక్కువ థియేటర్ లు లభించాయి .

తెలుగు చిత్రాలకు ఇతర బాషలలో మంచి డిమాండ్ ఏర్పడింది , ఇక బాహుబలి తర్వాత ఆ జోరు మరింతగా పెరిగింది అందులో భాగంగానే సాహో చిత్రానికి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .

అందుకే సాహో కు అత్యధికంగా 550 థియేటర్ లు లభించాయి . తెలుగు చిత్రాల్లో ఇదొక రికార్డ్ విడుదల విషయంలో . ప్రభాస్ కున్న క్రేజ్ తో ఈ స్థాయిలో అక్కడ విడుదల అవుతోంది .