సాహో హైలెట్స్ ఏంటో తెలుసా


saaho poster
saaho poster

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో . ఆగస్టు 30 న విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు . ఇప్పటికే ట్రైలర్ చూసిన వాళ్ళు హాలీవుడ్ మూవీ ని తలపిస్తోందని అంటున్న విషయం తెలిసిందే .భారీ అంచనాలున్న ఈ సాహో హైలెట్స్ ఏంటో తెలుసా …….

సినిమా 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కడం , 227 రోజుల్లో సాహో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోవడం , అబుదాబీ లో చిత్రీకరించిన భారీ యాక్షన్ సీన్ కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేయడం, సాహో లో యాక్షన్ సీన్స్ కి ప్రేక్షకులు థ్రిల్ అవ్వడం ఖాయమట  .

ఇక ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమా కోసం మొత్తంగా 70 సెట్స్ ని భారీగా వేయడం . నేషనల్ లెవల్లో పేరెన్నికగన్న నటీనటులను ఎంచుకోవడం ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే ఉంది . ఇదంతా ఎందుకంటే సినిమాపై భారీ అంచనాల కోసం అలాగే భారీ స్థాయిలో విడుదల చేయడం కోసం .

మొత్తానికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇక విడుదలకు సిద్ధమైంది ఈ సాహో . మొదటి రోజు రికార్డులు బద్దలు కావడం ఖాయం , అయితే సినిమా బాగుంటే ఆ జోరు మరింత పెద్దది అవుతుంది లేదంటే ………