సాహో మేకింగ్ వీడియో అదుర్స్prabhas saaho making video goes viral

ప్రభాస్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని సాహో మేకింగ్ వీడియో విడుదల చేసారు యువి క్రియేషన్స్ అధినేతలు . ఈ మేకింగ్ వీడియో నిజంగా అద్భుతమనే చెప్పాలి . ప్రభాస్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు వీక్షకులను విశేషంగా అలరిస్తోంది సాహో మేకింగ్ వీడియో . అద్భుతమైన విజువల్స్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి సాహో విజువల్స్ . ప్రభాస్ చివర్లో కనిపించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు . సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది సాహో . దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణ కానున్నాయి .

ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటించగా పలువురు ప్రముఖులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు . ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ మేకింగ్ టీజర్ సాహో పై భారీ అంచనాలను నెలకొనేలా చేసింది . బాహుబలి సిరీస్ లలో వచ్చిన చిత్రాల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో అందరి చూపు సాహో పైనే ఉంది . అయితే దానికి తగ్గట్లుగానే మేకింగ్ వీడియో ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు .

English Title: prabhas saaho making video goes viral