సాహో టీజర్ ఈనెల 13న


ఈరోజు జూన్ 10 అంటే మరో రెండు రోజుల తర్వాత సాహో టీజర్ విడుదల కానుంది . ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది . ఆగస్టు 15 న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ ఈనెల 13న విడుదల కానుంది .

 

ఈనెల 13న అంటే గురువారం రోజున నిమిషం కు పైగా నిడివి ఉన్న టీజర్ ని రిలీజ్ చేయనున్నారు సాహో బృందం . నిజానికి ఈ టీజర్ ని జూన్ 5 రంజాన్ సందర్బంగా విడుదల చేయాలనీ అనుకున్నారు అయితే సంగీత దర్శకులు ఈ చిత్రానికి హ్యాండ్ ఇవ్వడంతో అది వాయిదాపడింది . అందుకే ఈ ఆలస్యం . ఇక ఈ సినిమాని ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు .