సాహో వరల్డ్ వైడ్ క్లోజింగ్ బిజినెస్ డీటెయిల్స్


Saaho Collections
సాహో వరల్డ్ వైడ్ క్లోజింగ్ బిజినెస్ డీటెయిల్స్

బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన మరో భారీ చిత్రం సాహో. యాక్షన్ ఎంటర్టైనర్ దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో మొదటిరోజే పూర్తి నెగటివ్ రివ్యూలను తెచ్చుకుంది. తెలుగులో అయితే ఈ చిత్రాన్ని రివ్యూయర్లు చీల్చిచెండాడేసారు. అయినా కానీ సినిమా మీద ఉన్న బజ్ కారణంగా సాహోకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి.

అయితే సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనాలకు రుచించకపోవడంతో నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. వారాంతం ముగియగానే వసూళ్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఒక్క హిందీలో తప్ప ఈ చిత్రం మరే భాషలోనూ హిట్ అవ్వలేదు. డిజాస్టర్ ఫలితం అందుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు ప్రీ రిలీజ్ బిసినెస్ జరుపుకున్న సాహో ఫుల్ రన్ లో కేవలం 222 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగింది. పూర్తి బ్రేకప్ కింద చూడండి.

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 28.75

సీడెడ్ 11.90

నెల్లూరు 4.42

కృష్ణ 5.28

గుంటూరు 8.13

వైజాగ్ 9.34

ఈస్ట్ 7.44

వెస్ట్ 5.65

రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం 80.91

కర్ణాటక 18.00

రెస్ట్ ఆఫ్ ఇండియా 95.00

ఇండియా మొత్తం 193.91

ఓవర్సీస్ 29.00

ప్రపంచవ్యాప్త మొత్తం 222.91