యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `స‌లార్‌` షురూ!


యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `స‌లార్‌` షురూ!
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `స‌లార్‌` షురూ!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా స్థాయి చిత్రాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం `రాధేశ్యామ్` చిత్రంలో న‌టిస్తున్న ప్ర‌భాస్ ఈ మూవీ త‌రువాత మ‌రో రెండు చిత్రాల్ని ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ రూపొందించ‌నున్న `ఆది పురుష్‌` ఒక‌టి కాగా మ‌రోటి `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ రూపొందించ‌నున్న `స‌లార్‌`. ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

`కేజీఎఫ్‌` త‌ర‌హా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ మూవీ శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్రమానికి `కేజీఎఫ్‌` ఫేమ్ రాక్‌స్టార్ య‌ష్‌, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వ‌త్ నారాయ‌ణ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరోలు ప్ర‌భాస్‌, య‌‌ష్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ ఫొటోల‌కు పోజులిచ్చారు.

ప్ర‌స్తుతం ఈ ణ‌ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో హీరో ప్ర‌భాస్ డెవిల్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌భాస్ లుక్‌ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన మేక‌ర్స్ త్వ‌ర‌లో మ‌రో లుక్‌ని రివీల్ చేయ‌బోతున్నార‌ట‌. ఇందులో ప్ర‌భాస్‌ని శ‌క్తివంత‌మైన నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్‌కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నుంది.