సెట్లో అగ్ని ప్ర‌మాదంతో ప్ర‌భాస్ షెడ్యూల్ మారిందా?

సెట్లో అగ్ని ప్ర‌మాదంతో ప్ర‌భాస్ షెడ్యూల్ మారిందా?
సెట్లో అగ్ని ప్ర‌మాదంతో ప్ర‌భాస్ షెడ్యూల్ మారిందా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తూ బిజీగా వున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌రుస‌గా మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్నారు. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌‌క‌త్వంలో రూపొందుతున్న `రాధేశ్యామ్‌` దాదాపుగా పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇదిలా వుంటే మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ప్రారంభించిన `స‌లార్‌` ఫ‌స్ట్ షెడ్యూల్‌ని కూల్‌గా పూర్తి చేసుకుంది.

ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభానికి ముందే ఓం రౌత్ రూపొందిస్తున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్‌`లోనూ ప్ర‌భాస్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. అయితే ముంబైలోని ఓ స్టూడియోలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.

మోష‌న్ క్యాప్ష‌ర్ టెక్నాల‌జీని తొలి సారి ఈ చిత్రానికి ఉప‌యోగిస్తున్నారు. అయితే ఇట‌వ‌ల సెట్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో ముఖ్య‌మైన సెట్ ప్రార‌ర్టీతో పాటు కీల‌క ప‌రిక‌రాలు దెబ్బ‌బ‌తిన్నాయ‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఈ మూవీ షెడ్యూల్ మారిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. `ఆదిపురుష్‌` కేసం కేటాయించిన డేట్స్‌ని `స‌లార్‌`, నాగ్ అశ్విన్ చిత్రాల‌కు కేటాయిస్తార‌ని తెలిసింది.