సాహో టీముతో ప్రభాస్ సెల్ఫీ!!


prabhas selfi with saho teem
prabhas selfi with saho teem

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం “సాహో”. శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటించింది. యువి క్రియేషన్స్ పతాకంపై సుజీత్ దర్శకత్వంలో వంశీ-ప్రమోద్ తెలుగు తమిళ్, హిందీ భాషల్లో నిర్మించారు. అత్యధిక బడ్జెతో, హైటెక్నీకల్ వాల్యూస్తో విజువల్ వండర్ గా రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్బంగా ప్రభాస్ చిత్ర యూనిట్ తో సరదాగా సెల్ఫీ దిగారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నీల్ముఖేష్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో జాకీష్రాఫ్, మందిరాబేడీ, మురళిశర్మ, వెన్నెలకిషోర్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఆగస్టు 15న సాహో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలెర్ కి అభిమానులనుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కెమెరా విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ కలిగిస్తున్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తోందోనని అని ఫాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు !!