
`బాహుబలి`… ఈ మూవీని రాజమౌళి ఏ ముహూర్తాన రిలీజ్ చేశాడో కానీ ఈ సినిమా తరువాత ప్రభాస్ జాతకమే మారిపోయింది. స్టార్‌గా ఏ స్టార్ అందంత ఎత్తులో ప్రభాస్ ని ఈ సినిమా నిలబెట్టింది. పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. దేశ వ్యాప్తంగా అభిమానుల్ని అందించింది. ఎల్లలు లేని అభిమాన గనాన్ని సొంతం చేసింది. ఈ మూవీ బాలీవుడ్లో రిలీజ్ అయిన తరువాత ప్రభాస్‌కు ముంబై సెకండ్ హోమ్‌గా మారిపోయింది.
అ సినిమాతో బాలీవుడ్లో ప్రభాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు భారీ స్థాయిలో సెలబ్రిటీలు ఫ్రెండ్స్‌గా మారిపోయారు. దీంతో ప్రభాస్ తరచుగా ముంబైని విజిట్ చేయడం అలవాటుగా మారింది. పార్టీలకి, కరణ్ జోహార్ వంటి వ్యక్తులు నిర్వహిస్తున్న ప్రత్యేక షోలకి కూడా వెల్లడం మొదలుపెట్టారు. `బాహుబలి` తరువాత నుంచి ప్రభాస్ నటిస్తున్న ప్రతీ చిత్రం బాలీవుడ్లో రిలీజ్ కావడం ఆనవాయితీగా మారింది. దీంతో అక్కడికి వెళ్లిన ప్రతీ సారి స్టే చేయడం ప్రభాస్‌కు పెద్ద ప్రాబ్లమ్‌గా మారిందట.
దీంతో అక్కడ ఓ ఇంటిని తీసుకోవాలని ఇప్పటికే ప్రభాస్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ముంబైలో అత్యంత ఖరీదైన ఏరియాలో 75 కోట్ల విలువతో ప్రభాస్ సకల సౌకర్యాలు గల అపార్ట్‌మెంట్‌ని తీసుకోబోతున్నారట. ఇందుకు టీ సిరీస్ భూషన్‌కుమార్ అతనికి సహకరిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.