సాహో విషయంలో ప్రభాస్ చేస్తోంది కరెక్టేనా?


Prabhas
సాహో విషయంలో ప్రభాస్ చేస్తోంది కరెక్టేనా?

మొత్తానికి సాహో ఫైనల్ రన్ కు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్ర కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. నానీస్ గ్యాంగ్ లీడర్ విడుదలవ్వడం, వచ్చే వారం వాల్మీకి కూడా వస్తుండడంతో సాహో రన్ దాదాపు పూర్తయినట్లే. హిందీలో తప్పితే సాహో అన్ని చోట్లా విఫలమైందన్నమాట వాస్తవం. అయితే ప్రభాస్ ఈ విషయంలో పెదవి విప్పకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

సాధారణంగా హీరోలు సినిమా విఫలమవుతుంటే ఎలాగైనా లేపడానికి ప్రయత్నిస్తారు. లేదా ఓటమిని వినమ్రంగా ఒప్పుకుంటారు. సాహో విడుదలయ్యాక ప్రభాస్ చాలా సార్లు మీడియా ముందుకు వచ్చాడు. అయితే ఒక్కసారి కూడా ఈ సినిమా ఫలితంపై, చిత్రం సాధిస్తున్న కలెక్షన్స్ పై ఒక్క మాట కూడా చెప్పలేదు. సినిమా పోయిందనీ చెప్పలేదు. సూపర్ గా ఆడుతోందనీ చెప్పలేదు. రేటింగ్స్ తక్కువిచ్చిన రివ్యూయర్లను ఒక్క మాట కూడా అనలేదు. మొత్తంగా సాహో విషయంలో ప్రభాస్ సైలెంట్ గా ఉండిపోయాడు. అతను ఏం అనుకుంటున్నాడు అనేది ఎవరికీ అర్ధం కాకుండా ఉండిపోయింది.