డార్లింగ్‌ ప్రభాస్‌ పుట్టినరోజుకి ఎన్ని గిఫ్ట‌లు ఇస్తాడో?


డార్లింగ్‌ ప్రభాస్‌ పుట్టినరోజుకి ఎన్ని గిఫ్ట‌లు ఇస్తాడో?
డార్లింగ్‌ ప్రభాస్‌ పుట్టినరోజుకి ఎన్ని గిఫ్ట‌లు ఇస్తాడో?

డార్లింగ్ ప్ర‌భాస్ పుట్టిన‌రో‌జు నేడు. మ‌రి అభిమానుల‌కు ఏం గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడు? ఓవైపు పాన్ ఇండియా స్థాయి సినిమాల‌తో బిజీ. మ‌రోవైపు సామాజిక సేవ‌ల్లో బిజీబీజీ. క‌రోనా క్రైసిస్ అస‌లు అత‌డి స్పీడ్ కి ఏమాత్రం బ్రేక్ వేయ‌లేక‌పోయింది. వ్యూహం మార్చుకుని ఈ తీరిక స‌మ‌యంలో వ‌రుస‌గా ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టించి షాకిచ్చాడు ప్ర‌భాస్‌.

భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణం కావాలంటే పచ్చనిచెట్లు ఎంతో అవసరం అంటూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఎంపీ సంతోష్ తో క‌లిసి ప్రారంభించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన‌ క్రేజీ హీరో ప్రభాస్‌.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు చెట్లు నాటడం కాకుండా.. ఏకంగా ఓ అడవిలో పెద్ద ఎత్తున చెట్లు నాటించే కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. దుండిగల్‌ సమీపంలో ఖాజిపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ను హీరో ప్రభాస్‌ దత్తత తీసుకున్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చొరవతో 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకునేందుకు ప్రభాస్‌ ముందుకొచ్చారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట మరో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ అందుబాటులోకి రానుంది. తండ్రి దివంగత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణరాజు పేరు మీద అర్బన్‌ పార్కు.. అటవీ ప్రాంతాన్ని ప్రభాస్‌ అభివృద్ధి చేయనున్నారు ప్రభాస్‌. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్‌ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

ఒకవైపు ప్యాన్‌ ఇండియా సినిమాలు, మరోవైపు సామాజిక కార్యక్రమాలతో యూత్..‌ ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు మాస్ ప్రేక్ష‌కుల్లో కూడా ప్రభాస్‌ ఇమేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది. గత పుట్టినరోజుకి.. ఈ పుట్టినరోజుకి హీరోగా ప్రభాస్‌ రేంజ్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా పెరిగింది. స్టార్‌ మేకర్స్‌ అందరూ ఇప్పుడు ప్రభాస్ ‌తో సినిమా చేయడాన్ని ఓ స్టేటస్ ‌గా భావిస్తున్నారు. ఇలా ప్రతి సినిమాకు క్రేజ్‌ పెంచుకుంటోన్న ప్రభాస్‌ పెద్దనాన్న రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, తండ్రి స్వర్గీయ సూర్యనారాయణ ఆశీస్సులతో అగ్ర పథంలో దూసుకెళ్తున్నారు. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా డార్లింగ్ అంటూ పిలుస్తూ అంద‌రివాడ‌య్యారు. ఆయ‌న పుట్టినరోజు అక్టోబర్‌ 23. మ‌రి ఆరోజు ప్ర‌భాస్ ఏం బ‌హుమ‌తి ఇస్తారు ఫ్యాన్స్ కోసం? `రాధేశ్యామ్` కొత్త టీజ‌ర్ అలాగే.. `ఆదిపురుష్` 3డి లుక్ ని రిలీజ్ చేస్తాడా.. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్‌కి సంబంధించిన తాజా అప్‌డేట్ ని అందించ‌బోతున్నారా?  అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.