ప్ర‌భాస్ కోసం హ‌ద్దులు దాటేశారు..!Prabhas surprised his diehard fans
Prabhas surprised his diehard fans

అభిమాన హీరోని క‌ల‌వ‌డం, క‌లిసి పొటోలకు పోజు లివ్వాల‌ని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక తాము అభిమానించే హీరోని స్వ‌యంగా క‌లిసే అవ‌కాశం వ‌స్తే ఊరుకుంటారా ఎగిరి గంతేయరు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కొంత మంది అభిమాన‌లు అదే ప‌ని చేశారు. అయితే తాము అభిమానించే హీరో కోసం ఏకంగా హ‌ద్దులు దాటేసి, ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా దేశాలే దాటేసి వ‌చ్చి త‌మ అభిమానాన్ని చాటుకుని స‌ద‌రు హీరోని స‌ర్‌ప్రైజ్ చేయ‌డం ప్ర‌సుత్తం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

`బాహుబ‌లి` చిత్రంతో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన విష‌యం తెలిసిందే. అత‌ని ఫ్యాన్ బేస్ కూడా ఈ సినిమాతో అక్క‌డా ఇక్క‌డా అనే తేడా లేకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పెరిగిపోయింది. చైనాలోనూ ప్ర‌భాస్‌కి, రానాకి ఫ్యాన్ బేస్ ఏర్ప‌డిందంటే `బాహుబ‌లి` ఏ స్థాయి క్రేజ్‌ని తీసుకొచ్చిందో అర్థంచేసుకోవ‌చ్చు.  డైహార్డ్ ఫ్యాన్స్ కోసం `సాహో` సినిమా రిలీజ్ స‌మ‌యంలో చిత్ర బృందం ఓ కాంటెస్ట్‌ని నిర్వ‌హించింది. ప్ర‌భాస్ డైహార్డ్ ఫ్యాన్స్ అంతా `సాహో` పోస్ట‌ర్ ప‌క్క‌న నుంచొని దిగిన సెల్ఫీని కాంటెస్ట్‌కి పంపించాల‌ని కోరింది. దీంతో కుప్ప‌లు తెప్ప‌లుగా ఫ్యాన్స్ సెల్ఫీల‌ను `సాహో` టీమ్‌కు పంపించారు.

అందులోంచి 9 మంది ల‌క్కీ విన్న‌ర్స్‌ని హీరో ప్ర‌భాస్ ఇటీవ‌ల సెలెక్ట్ చేశారు. వీరికి నేరుగా హీరో ప్ర‌భాస్ ఇంటికి వ‌చ్చి క‌లిసే అవ‌కాశం క‌ల్పించారు. వీరంతా కాలిఫోర్నియాకు చెందిన వారు కావ‌డంతో ప్ర‌త్యేకంగా ప్ర‌భాస్‌ని క‌ల‌వ‌డం కోసం ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చారు. ప్ర‌భాస్ ఇంటికి వెళ్లి ప్ర‌త్యేకంగా ఆయ‌న‌తో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న `జాన్‌`లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.