ప్ర‌భాస్ ఏడాది పాటు విశ్రాంతి తీసుకోనున్నారా?


ప్ర‌భాస్ ఏడాది పాటు విశ్రాంతి తీసుకోనున్నారా?
ప్ర‌భాస్ ఏడాది పాటు విశ్రాంతి తీసుకోనున్నారా?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ య‌మ బి.ఈగా గ‌డిపేస్తున్న విష‌యం తెలిసిందే. అంగీక‌రించిన ప్రాజెక్ట్‌ల‌న్నీ పూర్తియిన త‌రువాత కొంత స‌మ‌యం బ్రేక్ తీసుకోవాల‌నుకుంటున్నారు. ఇదే త‌ర‌హాలో టాలీవుడ్ `బాహుబ‌లి` ప్ర‌భాస్ కూడా బ్రేక్ తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` చిత్రంలో న‌టిస్తున్న వియం తెలిసిందే. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ మూవీ త‌రువాత వెంట‌నే `కేజీఎఫ్‌` డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌బోతున్న `స‌లార్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ శుక్ర‌వారం లాంఛ‌నంగా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించ‌బోతున్నారు.

ఈ మూవీతో పాటు ఓం రౌత్ రూపొందించ‌బోతున్న త్రీడీ చిత్రం `ఆదిపురుష్‌` చేయ‌బోతున్నారు. టి సిరీస్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందబోతోంది. దీని త‌రువాత నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్థాయిలో తెర‌పైకి తీసుకురానున్న సైన్స్ ఫిక్ష‌న్ రూపొంద‌నుంది. ఇలా వ‌రుస ప్రాజెక్ట‌ల‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భాస్ వీటి త‌రువాత ఏడాది పాటు సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. అయితే ఈ వార్త ప్రభాస్ అభిమానులందరికీ కొంత రుచించ‌క‌పోయినా భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.