ప్రభాస్ దర్శకుల లిస్ట్ లో స్టార్ తమిళ దర్శకుడు

ప్రభాస్ దర్శకుల లిస్ట్ లో స్టార్ తమిళ దర్శకుడు
ప్రభాస్ దర్శకుల లిస్ట్ లో స్టార్ తమిళ దర్శకుడు

రెబెల్ స్టార్ ప్రభాస్ కు ప్రస్తుతమున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరసగా ప్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న నాలుగు సినిమాలు ప్రొడక్షన్ లో ఉండగా మరిన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి.

రాధే శ్యామ్ జులై 30న విడుదల కానుంది. సలార్ ను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు అలాగే ఆది పురుష్ ఆగస్ట్ 11న విడుదల అవ్వనున్నట్లు అధికారికంగా తెలిపారు. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 2023లో విడుదలవుతుంది.

ఇదిలా ఉంటే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఒక సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ప్రభాస్ కు ఒక లైన్ చెప్పినట్లు సమాచారం. ఖైదీ, మాస్టర్ చిత్రాలతో లోకేష్ మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. మరి ఈ సినిమా గురించిన అధికారిక సమాచారం వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉంది.