సాహో టీజర్ పై ప్రభాస్ ట్వీట్


Prabhas tweets on Saaho teaser
Prabhas tweets on Saaho teaser

అత్యంత భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” సాహో ” . యువి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదల కానుంది కాగా ఆ టీజర్ పై ప్రభాస్ సంతోషంగా ట్వీట్ చేసాడు . సాహో ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాను అంటూ ట్వీట్ చేసి తన అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు .

ఇక సాహో టీజర్ గురించి ఉమైర్ సందు ఏమన్నాడంటే ……. మైండ్ బ్లోయింగ్ ప్రభాస్ నిన్ను బీట్ చేసే హీరోలు ఎవరూ లేరు అంటూ సాహో టీజర్ ని చూసాను మాటల్లో చెప్పలేము ఆ అనుభూతి అంటూ ట్వీట్ చేసాడు . మొత్తానికి సాహో టీజర్ ని భారీ ఎత్తున రేపటి నుండి అన్ని థియేటర్ లలో ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు .