ప్రభాస్ మొదటి ప్రిఫరెన్స్ ఆ సినిమాకే!!

Prabhas Adi Purush Radhe Shyam Salaar
Prabhas Adi Purush Radhe Shyam Salaar

రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. రాధే శ్యామ్ షూటింగ్ ముగింపు దశలో ఉండగా సలార్, ఆది పురుష్ షూటింగ్ మధ్యలో ఉన్నాయి. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇంకా మొదలు కావాల్సి ఉంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ అన్నీ నిలిచిపోయిన విషయం తెల్సిందే. అయితే షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యాక ప్రభాస్ చేయబోయే చిత్రం ఏమిటనే సస్పెన్స్ అందరిలోనూ ఉంది. అయితే ప్రభాస్ విశ్వసనీయ వర్గాలు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాయి.

పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నెలలో ఆది పురుష్ షూటింగ్ ను మొదలుపెడతారు. అది కొనసాగుతుండగా మధ్యలో ఒక నెల రోజులు బ్రేక్ తీసుకుని రాధే శ్యామ్ ను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఈ ఏడాది చివరి దాకా ఆది పురుష్ కే కేటాయించనున్నాడు. ఈ మూడు సినిమాలు పూర్తయన తర్వాత నాగ్ అశ్విన్ చిత్రం కోసం బల్క్ డేట్స్ ను కేటాయించనున్నాడు. ఆ రకంగా ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రభాస్ ఫుల్ బిజీ. మరి కరోనా దీనికి సహకరిస్తుందేమో చూడాలి.