ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ మూవీ సైన్స్ ఫిక్ష‌నేనా?


 

Prabhas Vyjayanthi movies film a science fiction
Prabhas Vyjayanthi movies film a science fiction

ప్ర‌భాస్ అంతా యంగ్ డైరెక్ట‌ర్‌ల‌నే న‌మ్ముకుంటున్నారు. `సాహో` సినిమాని యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్‌తో చేసిన ప్ర‌భాస్ త‌రువాత చిత్రాన్ని కూడా రాధాకృష్ణ‌కుమార్‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజా చిత్రాన్ని కూడా యంగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌తో చేయ‌బోతున్నారు.  వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని సి. అశ్వ‌నీద‌త్ నిర్మించ‌బోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా జాన‌ప‌ద నేప‌థ్యంలో ఓ చంద‌మామ క‌థ‌లా వుంటుంద‌ని, దీని కోసం భారీగానే ప్లాన్‌లు చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇది జాన‌ప‌ద చిత్రం కాద‌ని, ఓ సైన్స్ ఫిక్ష‌న్ అని తాజాగా తెలిసింది. ఇటీవ‌ల ఓ చిన్న సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ త‌న తాజా చిత్రంపై వ‌స్తున్న ఊహాగానాకు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

త‌న‌కు ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ జోన‌ర్ అంటే ఇష్ట‌మ‌ని, త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఈ జోన‌ర్‌లోనే చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. దీంతో ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ చేయ‌బోతున్నసినిమా ఓ సైన్స్ ఫిక్ష‌న్ అని స్పష్ట‌మైంది. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కి జోడీగా బాలీవుడ్ క్రేజీ భామ‌ని తీసుకుంటున్నార‌ట‌. చిత్ర బృందం ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది.