ప్ర‌భాస్ ఎందుకింత సాహ‌సం చేస్తున్నారు?

ప్ర‌భాస్ ఎందుకింత సాహ‌సం చేస్తున్నారు?
ప్ర‌భాస్ ఎందుకింత సాహ‌సం చేస్తున్నారు?

క‌రోనా వైన‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. దీని దెబ్బ‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా వున్న దేశాల‌న్నీ వ‌ణికిపోతున్నాయి. ఎక్క‌డి వారు అక్క‌డే వుంటున్నారు. ఇత‌ర దేశాల‌కు, అదీనూ ముఖ్యంగా క‌రోనా వైర‌స‌ఖ విల‌య‌తాండ‌వం చేస్తున్న దేశాల‌కు టూరిస్ట్‌లు, సినిమా వాళ్లు వెళ్లాలంటేనే వ‌ణికిపోతున్నారు. కొన్ని సినిమాల షూటింగ్‌లు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కూడా కానీ ప్ర‌భాస్ మాత్రం త‌న `జాన్‌` సినిమా షూటింగ్‌ని మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆపేది లేద‌ని మొండికేస్తున్నాడు.

యూర‌ప్‌లో ముఖ్యంగా ఫ్రాన్స్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వ చేస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ 200 వంద‌ల మందికి పైగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్రాణాల్ని అరిచేతుత్తో పెట్టుకుని బిక్కి బిక్కుమంటూ బ్ర‌తుకీడుస్తున్నార‌ట‌. ఇంత ప్ర‌మాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో అక్క‌డ ఎట్టిప‌రిస్థితుల్లోనూ షూటింగ్ చేయాల్సిందే అంటూ ప్ర‌భాస్ ఫ్రాన్స్‌కు బ‌య‌లుదేశాడు. రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ సినిమా కీల‌క షెడ్యూల్ ఫ్రాన్స్‌లో చేయ‌డానికి యువీ బృందంతో క‌లిసి ప్ర‌భాస్ ఫ్రాన్స్ వెల్లాడు. విమానాశ్ర‌యంలో మాస్కులు ధ‌రించి భుజానికి ఓ బ్యాగ్ త‌గిలించుకుని బబ్లాక్ క్యాప్ ప్ర‌భాస్ వెళుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారాయి. ఇంత ప్రాణాంత‌క వైర‌స్ ప్ర‌బ‌లుతున్న వేళ ప్ర‌భాస్‌కు ఇంత సాహ‌సం అవ‌స‌ర‌మా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, ఫ్యాన్స్ ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.