మెగాస్టార్ తో యంగ్ రెబల్ స్టార్!


Prabhas with Chiranjeevi and Ram Charan
Prabhas with Chiranjeevi and Ram Charan

బొంబాయిలో జరిగిన సైరా నరసింహా రెడ్డి టీజర్ రిలీజ్ అనంతరం మెగాస్టార్ చిరంజీవిని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందే సాహో టీజర్ చూసి ప్రభాస్ కి ఫోన్ చేసి చిరంజీవి అభినందించారు..

సాహో ప్రమోషన్స్ కోసం ముంభై వెళ్లిన ప్రబాస్ విస్తృతంగా మీడియా పబ్లిసిటీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ నుండి హైయ్యెస్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి, సాహో వంటి చిత్రాలు విడుదలవడం తెలుగు పరిశ్రమకి గర్వకారణం అని అందరు ముక్తకంఠంతో చెబుతున్నారు..

మెగాస్టార్, రెబల్ స్టార్, మధ్యలో మెగా పవర్ స్టార్ ఇలా ముగ్గురు కలిసి పరస్పరం అభినందించుకోవడం అందరి ఫ్యాన్స్లో లో నూతనోత్సాహం కలుగుతోంది.. సైరా నరసింహ రెడ్డి అక్టోబర్ 2న విడుదల కానుండగా, సాహో ఆగస్ట్ 30న రిలీజ్ అవుతుంది..