సాహో ప్రీ రిలీజ్ ఎప్పుడు ? ఎక్కడో తెలుసా ?


Prabhas's Saaho Pre Release event date and Venue Locked
Prabhas’s Saaho Pre Release event date and Venue Locked

ప్రభాస్ నటించిన సాహో ఈనెల 30 న భారీ ఎత్తున విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు ఆ చిత్ర యూనిట్ . ఇంతకీ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ? ఎక్కడో తెలుసా …….. ఈనెల 18 న లాల్ బహదూర్ స్టేడియం లో ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలం మధ్య నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు .

త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్నీ వెల్లడించనున్నారట సాహో బృందం . ప్రభాస్ అభిమానులను ఈ వేడుకకు భారీ ఎత్తున ఆహ్వానిస్తున్నారు . వాళ్ళ సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించనున్నారట . ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ వేడుక పెద్ద పండగే అని చెప్పాలి . ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు , హిందీ , తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు .