చిన్న‌ చిత్రాన్ని ప్ర‌శంసించిన బాహుబ‌లి!


Prabhsa prises 22 movie
Prabhsa prises 22 movie

ఈ మ‌ధ్య కాలంలో చిన్న చిత్రాలు కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో వ‌స్తున్నాయి. ప్రేక్ష‌కుల‌తో పాటు సెల‌బ్రిటీల‌ని కూడా ఆక‌ట్టుకుంటూ వారి ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా ఓ చిన్న చిత్రం బాహుబ‌లి ప్ర‌భాస్ ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. ప్ర‌ముఖ పీఆర్వో బిఏ రాజు త‌న‌యుడు శివకుమార్‌ `22 పేరుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నాడు. ద‌ర్శ‌క‌డిగా ఇదే అత‌ని తొలి చిత్రం.

ఈ చిత్రం ద్వారా రూపేష్‌కుమార్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. స‌లోని మిశ్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రూపేష్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌ని ఇటీవ‌ల హీరో అక్కినేని నాగార్జున రిలీజ్ చేశారు. టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా వుంద‌ని, శివ చిత్రాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడ‌ని, సినిమా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం వుంద‌ని చిత్ర బృందాన్ని అభినందించారు.

తాజాగా ఈ చిత్రంలోని `మార్ మార్ కే జీనా హై .. అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని బాహుబ‌లి యంగ్ రెబ‌ల్‌స్టార్‌ ప్ర‌భాస్ రిలీజ్ చేశారు. లిరిక‌ల్ వీడియో చూశాను. పాట చాలా బాగుంది. శివ‌రు ఇది ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా. మంచి విజ‌యం సాధించాలి` అని టీమ్‌ని ప్ర‌శంసించారు. వినూత్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.