ప్ర‌భుదేవా ఏంటా అవ‌తారం?ప్ర‌భుదేవా ఏంటా అవ‌తారం?
ప్ర‌భుదేవా ఏంటా అవ‌తారం?

ప్ర‌భుదేవా ఓ ప‌క్క డైరెక్ట‌ర్‌గా భారీ చిత్రాలు చేస్తూనే మరో ప‌క్క హీరోగా కూడా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నాడు. గెస్ట్ పాత్ర‌ల్లోనూ మెరుస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల బాలీవుడ్ ఖాన్ స‌ల్మాన్‌ఖాన్‌తో `ద‌బాంగ్ 3`ని రూపొందించాడు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో 0ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇదిలా వుంటే వ‌రుస చిత్రాల్లో హీరోగా న‌టిస్తూ ప్ర‌భుదేవా హంగామా చేస్తున్నాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న త‌మిళ చిత్రం `బగీరా`.

అధిక్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ‌నివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని హీరో విజ‌య్ సేతుప‌తి రిలీజ్ చేశారు. ఆర్‌.వి. భ‌ర‌త‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `నో మోర్ వాలెంటైన్స్ డే` అనే స్లోగ‌న్‌, గుండుతో ప్ర‌భుదేవా త్రీ గ్లాసెస్ స్పెట్స్‌తో విచిత్రంగా క‌నిపిస్తున్నారు. వెన‌కాల క‌నుగుడ్లు గుట్ట‌లుగా పోసివున్న‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఈ పోస్ట‌ర్ని బ‌ట్టి చూస్తుంటే ప్ర‌భుదేవా ఓ సైకో కిల్ల‌ర్‌గా న‌టిస్తున్న‌ట్టు క‌నిస్తోంది.

పోస్ట‌ర్ పై వున్న `నో మోర్ వాలెంటైన్స్ డే` అనే స్లోగ‌న్‌ని బ‌ట్టి ప్ర‌భుదేవా ప్రేమికుల‌కు వ్య‌తిరేకిగా క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తయిన ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో ప్ర‌భుదేవాని చూసిన వాళ్లంతా ప్ర‌భుదేవా ఏంటా అవ‌తారం అని ట్రోల్ చేస్తున్నారు.