30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా నేర్పించేస్తార‌ట‌!Pradeep Machiraju debu as a hero
Pradeep Machiraju debu as a hero

యాంక‌ర్‌లు సినిమాల్లోకి ప్ర‌వేశించ‌డం ఈ మ‌ధ్య సాధార‌ణంగా జ‌రుగుతోంది. అయితే అందులో ఇంత వ‌ర‌కు స‌క్సెస్ అయిన వారి సంఖ్య మాత్రం పెరగ‌డం లేదు. హీరో శివాజీ, క‌ల‌ర్స్ స్వాతి, ఝాన్సీ, సుమ‌, యాంక‌ర్ ర‌వి, చ‌మ్మ‌క్ చంద్ర‌, సుడిగాలి సుధీర్‌, అన‌సూయ‌… ఇలా పెద్ద లిస్టే వుంది. లిస్టులోకి తాజాగా బుల్లితెర యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు చేర‌బోతున్నారు.

అల్లు అర్జున్ న‌టించిన `వ‌రుడు`, నాగ‌చైత‌న్య న‌టించిన `100 % ల‌వ్‌`, అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `జులాయి`, ప‌వ‌న్ న‌టించిన `అత్తారింటికి దారేది`, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `రామ‌య్యా వ‌స్తావ‌య్యా`, భ‌మ్ భోలేనాథ్ వంటి చిత్రాల్లో ప్ర‌దీప్ చిన్న చిన్న పాత్ర‌లో మెరిశాడు. 2015 వ‌రుత‌వాత మ‌ళ్లీ మ‌రో చిత్రంలో క‌నిపించ‌ని ఈ బుల్లితెర యాంక‌ర్ తాజాగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ప్ర‌దీప్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వ‌స్తున్న ఆ చిత్రాన్ని ఎస్వీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. మున్నాఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సోమ‌వారం (27-01-2020) ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. గ్రామీణ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తోంది.