ప్ర‌దీప్ సినిమా ఓవ‌ర్సీస్‌ రిలీజ్ లేదా?


ప్ర‌దీప్ సినిమా ఓవ‌ర్సీస్‌ రిలీజ్ లేదా?
ప్ర‌దీప్ సినిమా ఓవ‌ర్సీస్‌ రిలీజ్ లేదా?

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లంతా సినిమాల్లో రాణించాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి చివరికి బుల్లితెర‌పైనే ప్రోగ్రామ్‌లు చేసుకుంటున్నారు. యాంక‌ర్ ఝాన్సీ, సుమ‌, శిల్పాచ‌క్ర‌వ‌ర్తి, శ్రీ‌ముఖి, యాంక‌ర్ ర‌వి.. శివాజీ బుల్లి తెర నుంచే వ‌చ్చినా చాలా కాలం సినిమాల్లో రాణించాడు. ప్ర‌స్తుతం తెర‌మ‌రుగ‌య్యాడు. క‌ల‌ర్స్ స్వాతి కూడా బుల్లితెర నుంచే సినిమాల్లోకి ప్ర‌వేశించింది.

కొన్ని సినిమాల్లో మెరిసింది కూడా కానీ ఆశించిన స్థాయిలో అవ‌కాశాల్ని మాత్రం పొంద‌లేక‌పోయింది. ఇదే బాట‌లో యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. త‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `30రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?`. ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్వీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్ర‌దీప్ టూ షేడ్స్ వున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు మిగ‌తా ఏరియాల్లోనూ విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లో మాత్రం రిలీజ్ కావ‌డం లేదు. క్రేజ్ లేద‌నా లేక ఓవ‌ర్సీస్‌లో రిలీజ్ చేయ‌డానికి ఏ డిస్ట్రిబ్యూట‌ర్ ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నా అన్న‌ది మాత్రం తెలియ‌లేదు. మొత్తానికి ప్ర‌దీప్ తొలి సినిమా ఓవ‌ర్సీస్ రిలీజ్ లేద‌ని తెలిసింది.