యాంకర్ ప్రదీప్ తండ్రి కన్నుమూత

Pradeep machirajus father passed away
Pradeep machirajus father passed away

స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తనదైన శైలిలో వినోదం పంచుతూ బుల్లితెరపై నెం 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రదీప్ మాచిరాజు ఏదైనా షో హోస్ట్ చేసాడంటే అది కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకముంది జనాల్లో. అయితే గత కొన్ని రోజులుగా ప్రదీప్ షోస్ కు అటెండ్ అవ్వడం లేదు. ప్రదీప్ కు కరోనా సోకిందని అందుకే షోస్ కు అటెండ్ అవ్వడం లేదని రూమర్స్ వచ్చాయి.

కానీ అసలు విషయం ఏమిటంటే ప్రదీప్ తండ్రి పాండు రంగ మాచిరాజు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆయన వయసు 65 సంవత్సరాలు. గత రాత్రి ప్రదీప్ తండ్రి గారికి అనారోగ్యం తీవ్రం కావడంతో తుదిశ్వాస విడిచారు.

పాండు రంగ మాచిరాజు కోవిద్ తో కన్నుమూశారని కూడా అంటున్నారు. అయితే దీనిపై సరైన క్లారిటీ మాత్రం లేదు. ప్రదీప్ కు అన్ని వర్గాల నుండి సానుభూతి వ్యక్తమవుతోంది. ఇటీవలే హీరోగా కూడా ప్రదీప్ సక్సెస్ సాధించాడు. హీరోగా తన తొలి చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా మంచి విజయాన్ని అందుకుంది.