బుల్లెట్‌పై చ‌క్క‌ర్లు కొట్టిన `ఎఫ్‌2` ఆంటీ!

Pragathi Bullet ride goes viral
Pragathi Bullet ride goes viral

అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్‌2`. విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించారు. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రంలో వీరిద్ద‌రికి  త‌ల్లిగా హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ల‌కు ఆంటీగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి న‌టించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ టైమ్ నుంచి సోష‌ల్ మీడియాలో ఈ పేరు వైర‌ల్‌గా మారుతోంది.

ఓ సారి వ‌ర్క‌వుట్ వీడియోల‌తో ర‌చ్చ చేసిన ప్ర‌గ‌తి ఆ త‌రువాత త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన సినిమాకు సంబంధించిన మాస్ బీట్‌కు అద‌రిపోయే స్టెప్పులేసిన వీడియో ఇన్ స్టాని హీటెక్కించిన విష‌యం తెలిసిందే. త‌న ప్ర‌తి వీడియోతో స‌ర్‌ప్రైజ్ చేస్తూ యంగ్ స్ట‌ర్స్‌కి స‌వాల్ విసిరిన ప్ర‌గ‌తి తాజాగా మ‌రో ఫీట్‌ని చేస ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

రెడ్ క‌ల‌ర్ బుల్లెట్‌పై చ‌క్క‌ర్లు కొడుతూ హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని ఇన్ స్టా వేదిగా అభిమానుల కోసం షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌గ‌తి చీర క‌ట్టి బెల్లెట్‌పై రైడ్ చేయ‌డంతో అక్క‌డున్న వారంతా ఆ దృశ్యాన్ని త‌మ సెల్‌ఫోన్‌ల‌లో బంధించారు. ఇప్పుడు ప్ర‌గ‌తి బుల్లెట్ న‌డుపుతున్న వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)