ప్రగతి నివేదన సభ అట్టర్ ప్లాప్


pragathi nivedana meeting utter flopనిన్న ఎంతో అట్టహాసంగా పెట్టిన ప్రగతి నివేదన సభ అట్టర్ ప్లాప్ అంటూ ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయి . 25 లక్షల జనాలు వస్తున్నారు అంటూ పక్షం రోజుల ముందు నుండే ప్రగల్భాలు పలికారు కానీ గ్రామాల్లోంచి వచ్చిన ట్రాక్టర్ లలో జనాలు లేక ఖాళీ ట్రాక్టర్ లు దర్శనం ఇచ్చాయి , అయితే టీఆర్ ఎస్ చెప్పినట్లుగా 25 లక్షల మంది రాలేదు కానీ పెద్ద సంఖ్యలోనే ప్రజలను , కార్యకర్తలను తరలించారు టీఆరెస్ శ్రేణులు . ఎం ఎల్ ఏ లు , ఎంపీలు , ఎం ఎల్ సి లు ఇతర నాయకులు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు అయితే అందరూ కేసీఆర్ ఏం మాట్లాడతాడో ? ఏ ప్రకటన చేయనున్నాడో అని ఎదురు చూసారు కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగడంతో నీరుగారిపోయారు .

ఇంతోటి దానికి ఓ ప్రెస్ మీట్ పెడితే సరిపోయేది కదా ! అంటూ టీఆర్ ఎస్ శ్రేణులే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు . కొండంత రాగం తీసినట్లుగా ఏదో జరగబోతోంది అనుకుంటే ఇంకేదో అయినట్లుగా సభ యావత్తు నిరాశలో మునగగా కేసీఆర్ ప్రసంగమైనా ఆకట్టుకునేలా సాగిందా అంటే అది కూడా వాడి వేడి లేకుండా చప్పగా సాగింది దాంతో ప్రతిపక్షాలను పక్కన పెట్టండి టీఆర్ ఎస్ శ్రేణులే చతికిలబడిపోయాయి . ఇంతోటి దానికి సభ పెట్టడం ఎందుకు ? మీడియా ముందుకు వచ్చి చెబితే సరిపోయేది కదా ! అని అంటున్నారు . అయినా కేసీఆర్ ఎత్తులు వేయడంలో దిట్ట కాబట్టి సరైన సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది . మొత్తానికి ప్రగతి నివేదన సభ టీఆర్ ఎస్ శ్రేణుల్లో సంతోషం నింపాల్సింది పోయి నిరాశని మిగిల్చిందని అంటున్నారు .

English Title: pragathi nivedana meeting utter flop