వ‌రుణ్‌తేజ్ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా!

వ‌రుణ్‌తేజ్ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా!
వ‌రుణ్‌తేజ్ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా! ( Pic Credit: Instagram )

ప్ర‌గ్యా జైస్వాల్ మ‌ళ్లీ బికినీ ట్రీట్‌తో రెచ్చిపోయింది. వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన చిత్రం `కంచె`. విభిన్న‌మైన స్క్రీన్‌ప్లేతో క్రిష్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. భ‌గ్న ప్రేమికుల ఫాంట‌సీ ప్రేమ‌క‌థ‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా ముంబై బ్యూటీ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది. షేర్స్పియ‌ర్ అంటూ వ‌రుణ్‌తో హంగామా చేసిన ప్ర‌గ్యాకు గ‌త కొంత కాలంగా తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు లేవు.

గుంటూరోడు, న‌క్ష‌త్రం, ఆచారి అమెరికా యాత్ర చిత్రాల్లో న‌టించినా పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. దీంతో ప్ర‌త్యేక గీతాల్లో మెర‌వాల‌ని `జ‌య జాన‌కి నాయ‌క‌` చేసినా అదీ అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది. దీంతో సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటో షూట్‌ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. తాజాగా ప్ర‌గ్యా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ ఫోటో ఇంట‌ర్నెట్‌ని మ‌ళ్లీ హీటెక్కించేస్తోంది.

స‌న్ సెట్‌ని ఎంజాయ్ చేస్తున్నానని ఆ ఫొటోకి ప్ర‌గ్యా క్యాప్ష‌న్ కూడా ఇవ్వడంతో ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్రగ్యాకు ఇటీవ‌ల బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింద‌ని, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క్రిష్ తెర‌కెక్కిస్తున్న పిరిమాడిక్ చిత్రంలో రెండ‌వ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని, దీంతో టాలీవుడ్‌లో ఆమె కెరీర్ మ‌లుపు తిరుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, అది వ‌ట్టి పుకారేన‌ని తాజాగా తేలింది.

 

View this post on Instagram

 

Sunset state of mind!! ??‍♀️?

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on