పవన్ సినిమాలో ఆ భామ.. అది పచ్చి పుకారు!పవన్ సినిమాలో ఆ భామ.. అది పచ్చి పుకారు!
పవన్ సినిమాలో ఆ భామ.. అది పచ్చి పుకారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసాడు. పింక్ రీమేక్ షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించాడు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు ఒక హీరోయిన్ కూడా ఉంటుంది. అలాగే మొత్తంగా ఐదు పాటలు కూడా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి పవన్ తన తర్వాతి సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో పాటు క్రిష్ తో ఒక చిత్రాన్ని కూడా కమిటైన విషయం తెల్సిందే. ఈ సినిమాను కూడా త్వరలోనే లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో కనిపిస్తాడని, ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఈ సినిమా సెటప్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ కన్ఫర్మ్ అయినట్లు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. పూజ హెగ్డే మాటేమో కానీ ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఈ సినిమాలో లేదని కచ్చితంగా క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ క్రిష్ దర్శకత్వంలోనే తెలుగు సినిమాకు పరిచయమైంది. అందువల్లే ఇలాంటి రూమర్స్ వచ్చి ఉండాలి. అంతేతప్ప అందులో ఎటువంటి నిజాలు లేవని సమాచారం. ఇంతకీ ఇందులో హీరోయిన్లు ఎవరనే దానిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.