ప‌వ‌న్ కోసం క్రిష్ హీరోయిన్ రెడీ?Pragya jaiswal on Pawankalyan film
Pragya jaiswal on Pawankalyan film

కొంత విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ కెమెరా ముందుకు వచ్చిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` రీమేక్ కోసం మ‌ళ్లీ మేక‌ప్ వేసుకుంటున్న ప‌వ‌న్ ఒకే సారి రెండు భారీ ప్రాజెక్ట్‌ల‌ని చేయ‌బోతున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న `పింక్‌` తెలుగు రీమేక్ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. సెట్‌లో తొలి రోజు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ప‌వ‌న్ ఎంట‌రైన ఫొటోలు బ‌య‌టికి లీక్ అయిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమా కోసం కేవ‌లం ప‌వ‌న్ 30 రోజులు మాత్ర‌మే కేటాయించిన ప‌వ‌న్ వెంట‌నే మ‌రో సినిమాని ప్రారంభించ‌బోతున్నార‌ట‌. దీనికి క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. ఒక‌నాటి బందిపోటు దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్షన్ వ‌ర్క్‌ని ఫినిష్ చేసిన క్రిష్ ఈ చిత్రాన్ని ఈ నెల 27న లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నార‌ట‌.

పాన్ ఇడియా స్థాయిలో భారీ హంగుల‌తో రూపొందించ‌బోతున్న ఈ సినిమా కోసం ప‌వ‌న్‌కు జోడీగా ఓ హీరోయిన్‌ని కూడా క్రిష్ ఖ‌రారు చేసిన‌ట్లు తెలిసింది. ఆమె మరెవ‌రో కాదు క్రిష్ `కంచె` చిత్రంతో ప‌రిచ‌యం చేసిన ప్ర‌గ్యా జైస్వాల్‌. వ‌రుణ్ హీరోగా న‌టించిన‌ `కంచె` చిత్రంలో ` హేయ్ షేక్స్ప్‌య‌ర్‌..` అంటూ ఆక‌ట్టుకుంది ప్ర‌గ్యా జైస్వాల్‌. పిరియాడిక‌ల్ డ్రామా కావ‌డంతో ఈ చిత్రానికి ఆమే క‌రెక్ట్ అని భావించిన క్రిష్ ..ప్ర‌గ్యా జైస్వాల్‌ని రంగంలోకి దింపిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.