బాలయ్య సినిమాకు మళ్ళీ హీరోయిన్ షాక్


బాలయ్య సినిమాకు మళ్ళీ హీరోయిన్ షాక్
బాలయ్య సినిమాకు మళ్ళీ హీరోయిన్ షాక్

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రానికి హీరోయిన్ల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. మొదటగా మలయాళ నటి ప్రయాగ మార్టిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఒకరోజు షూటింగ్ జరిగిన తర్వాత ఆమెను తప్పించి సయేషా సైగల్ ను ఎంపిక చేశారు. ఈమె పేరును అధికారికంగా వెల్లడించారు కూడా. సయేషా కూడా తనను హీరోయిన్ గా ఎంపిక చేసినందుకు టీమ్ కు కృతఙ్ఞతలు తెలియజేసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం సయేశా సైగల్ కూడా ఈ సినిమా నుండి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. కారణాలు తెలియదు కానీ సయేశా ఈ సినిమాలో చేయకూడదు అని నిర్ణయించుకుందిట. ఇక చేసేది లేక ఈ సినిమాలో హీరోయిన్ గా అప్పటికప్పుడు ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈరోజు నుండి ఈ భామ షూటింగ్ లో పాల్గొంటోంది. ప్రగ్యా జైస్వాల్ తో పాటు పూర్ణ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే.

బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం. ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.