సొంత పార్టీ పెడతానంటున్న ప్రకాష్ రాజ్


 

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సొంత పార్టీ పెడతానని ప్రకటించాడు . ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బెంగుళూర్ సెంట్రల్ నుండి పోటీ చేసి దారుణమైన ఓటమి చవిచూసాడు ప్రకాష్ రాజ్ . చిత్తుచిత్తుగా ఓడిపోయినప్పటికీ ప్రకాష్ రాజ్ విశ్లేషణ భలేగా ఉంది తెలుసా …….. ఇండిపెండెంట్ గా పోటీ చేసాను కాబట్టే జనాలు అంతగా పట్టించుకోలేదు అదే సొంత పార్టీ అయితే మరోలా ఉండేది అందుకే త్వరలోనే పార్టీ పెట్టబుతున్నాను అంటూ ప్రకటించాడు .

దక్షిణ భారతదేశంలో ప్రకాష్ రాజ్ కు నటుడిగా అనూహ్యమైన క్రేజ్ ఉంది కానీ రాజకీయం వేరు ….. సినిమాలు వేరు . ఇప్పటికే పలువురు హీరోలు తెరమీద అనితర సాధ్యమైన విషయాలను సుసాధ్యం చేసారు కానీ రాజకీయంగా జీరోలు అయిన విషయం తెలిసిందే . ఇలా చాలామందికి జరిగింది కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా నేను సొంత రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అని అంటున్నాడు . కర్ణాటకలో వచ్చే ఏడాది కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి . అవి నాకు అగ్ని పరీక్ష అని అంటున్నాడు చూద్దాం ఏమౌతుందో !