ప్రకాష్ రాజ్ పోటీ చేసేది ఎక్కడి నుండో తెలుసా


Prakash raj contesting from Bengalur central

బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే . తాజాగా ఎక్కడి నుండి పార్లమెంట్ కు పోటీ చేయబోతున్నాడో కూడా ప్రకటించాడు . కర్ణాటక లోని బెంగుళూర్ సెంట్రల్ నుండి ఇండిపెండెంట్ గా పార్లమెంట్ కు పోటీ చేయనున్నట్లు ట్వీట్ చేసాడు ప్రకాష్ రాజ్ . రాజకీయాల్లోకి వస్తున్నట్లు , పార్లమెంట్ కు పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని , నా రాకని అందరూ స్వాగతిస్తున్నారని నాకు మద్దతు ప్రకటించిన అందరికీ కృతఙ్ఞతలు అంటూ మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని ట్వీట్ చేసాడు ప్రకాష్ రాజ్ .

గత ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి విజయం కోసం ప్రకాష్ రాజ్ కష్టపడ్డాడు . అలాగే భారతీయ జనతా పార్టీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసాడు . దాంతో జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వొచ్చు . ప్రకాష్ రాజ్ మాత్రం ప్రస్తుతానికైతే ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు .

English Title: Prakash raj contesting from Bengalur central