స‌న్ సెట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు!


స‌న్ సెట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు!
స‌న్ సెట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు!

క‌రోరా వ‌ణికిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఇంటి నుంచి కాలు బ‌య‌ట పెట్ట‌డానికి వ‌ణికిపోతున్నారు. ఫ్యామిలీతో క‌లిసి ఇంట్లోనే విలువైన స‌మ‌యాన్ని గ‌డిపేస్తున్నారు. వంటి చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో వుంటూ పొల్యూష‌న్ త‌గ్గిన వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా లాక్‌డౌన్ స‌మ‌యాన్ని త‌న ఫ్యామిలీతో క‌లిసి ఫామ్ మౌస్‌లో గ‌డిపేస్తున్నారు. కొడుకుతో క‌ల‌సి స‌న్ సెట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ని నెటిజ‌న్స్‌తో పంచుకుంటున్నారు. ప్ర‌కాష్ రాజ్ షేర్ చేసిన ఫొటోలు ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమాల్లో విల‌నిజాన్ని చూపించి భ‌య‌పెట్టిన ప్ర‌కాష్ రాజు ప్ర‌స్తుతం హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు.

తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న పెట్టిన ఫొటోలే ఈ విష‌యాన్ని వివ‌రిస్తున్నాయి. `కొడుకుతో స‌న్ సెట్‌ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని, త‌న ప్రియ‌మైన భార్య‌, కూతురు పిజ్జా త‌యారు చేశార‌ని,  ఫామ్ హౌస్‌లో ఈ లాక్‌డౌన్ టైమ్‌లో విలువైన స‌మ‌యాన్ని ఫ్యామిలీతో గ‌డిపేస్తున్నాన‌ని, ఇంటి ప‌ట్టునే వుండండి.. క్షేమంగా వుండండి` అని ట్వీట్ చేశారు.

Credit: Twitter